
కః కుర్యాత్పామరాన్దృష్ట్వా రోదనం సకలేశ్వరః |
సదయాం పరమేశానీం శతాక్షీం మాతరం వినా ||
న శతాక్షీ సమా కాచిత్ దయాలుః భువి దేవతా |
దృష్ట్వా2 రుదః ప్రజాః తప్తా యా నవాహం మహేశ్వరీ ||
అత్యంత పామరులపై దయ చూపే దేవత శతాక్షీ మాత. భువిలోని జీవులు ఆకలి దప్పికలతో తపించడం చూచి తాను తొమ్మిది దివసములు రోదించి జాలి పడుతూ వెనువెంటనే వారి దప్పిక ఆకలి తీర్చిన కరుణామయి శాకంభరి. ఆపై జీవుల ఆకలి దప్పులకు కారణమైన భయంకరుడైన దుర్గమాసురుని కడతేర్చిన దుర్గ. శతాక్షీ శాకంభరీ దుర్గా చరితము.
దేవీ భాగవతము ఏడవ సర్గ 28 వ అధ్యాయము, , శివ మహా పురాణము ఉమా సంహిత 50 వ అధ్యాయము, మార్కండేయపురాణము లోని దేవీ మహాత్య్మము నారాయణీ స్తుతి అనే అధ్యాయములో శాకంభరీ (శతాక్షీ) మాహాత్మ్యమ్ వర్ణించబడినది.
ఈ అరుదైన శతాక్షీ శాకంభరీ మాహాత్మ్యమ్ శ్లోక భాగాలను దేవీభాగవతము, శివ, మార్కండేయ పురాణముల నుంచి అమ్మ దయతో శ్రీ అక్షరం ఉమామహేశ్ గారు దేవీ భక్తులకొరకు తెలుగు వారైన సంస్కృత అభిలాషుల కొరకు మొట్టమొదటి సారిగా తెలుగు లిపిలో ఒక చోట సంకలనము చేయడము జరిగినది. ఈ చరిత్రము పఠించిన వారికి విన్న వారికి సకల శుభాలూ అన్నవృద్ధీ ఆ ప్రాంతంలో సుభిక్షమూ కలుగుతాయని మునుల వచనము.
Details
- Publication Date
- Mar 30, 2022
- Language
- Telugu
- Category
- Religion & Spirituality
- Copyright
- All Rights Reserved - Standard Copyright License
- Contributors
- By (author): Umamahesh Senagavarapu
Specifications
- Format